ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి
● ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
పలమనేరు : ఆర్టీసీలో ఖర్చులు తగ్గించి ఆదా యాన్ని పెంచే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొ న్నారు. పలమనేరు డిపోలో మంగళవారం జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలమనేరు బస్టాండు, డిపోలను ఆయన పరిశీలించారు. అనంతరం డిపో వద్ద మొక్కలను నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. డిపోలోని 11 మంది ఆదర్శ ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వలే మీరు కార్మికులు కాదని ఉద్యోగులేననని గుర్తుంచుకోవాలన్నారు. సీఎస్‌పీ, ప్రమాదబీమా, ఆర్‌పీఎస్‌లు సెటిల్ చేశా మన్నారు. ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ పెండింగ్ బకాయిలను త్వరలో ఇస్తామన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణికులకు మర్యాదనివ్వడం చాలా ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో స్థానిక డీఎం టీకే స్వామి, వివిధ కార్మికసంఘాల నేతలు పాల్గొన్నారు.


