మహిళ మెడలో గొలుసు అపహరణ
పుత్తూరు : బైక్‌పై వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును మరో బైక్‌పై వచ్చిన దుండగుడు లాక్కొని పరారైన సంఘటన శనివారం రాత్రి పుత్తూరులో చోటు చేసుకుంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. తిరుపతికి చెందిన కళ్యాణి(55) పుత్తూరులో వ్యవసాయ మోటార్ల షాపును నిర్వహిస్తున్నారు. యథావిధిగా రాత్రి 8 గంటలకు షాపును మూసివేసిన కళ్యాణి, తమ్ముడు శ్రీరామ్‌తో కలసి తిరుపతికి బైక్‌పై బయలుదేరారు. స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఫ్‌లైఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగుడు కళ్యాణి మెడలోని రెండున్నర సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనలో కిందపడ్డ కళ్యాణికి తల వెనక భాగంలో, మెడపైనా రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణి


