పుంగనూరు 6 మండలాల బదిలీ నోటిఫికేషన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల బదిలీకి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రచురించారు. ఈ మేరకు ఆ నోటిఫికేషన్ ను కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని ఆర్డీవో, అన్ని మండల కార్యాలయాలకు పంపారు. ప్రచురించిన ప్రాథమిక నోటిఫికేషన్ ను అన్ని కార్యాలయాల్లోని నోటీస్ బోర్డుల్లో పెట్టాలన్నారు. ప్రచురించిన ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం.....
● చిత్తూరు జిల్లాలోని ఆరు మండలాలను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
● చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్‌కు బదలాయించనున్నారు.
● మండలాల బదిలీ పై అభ్యంతరాలు, సూచనలను ఇంగ్లీషు, తెలుగులో లిఖిత ర్వకంగా రాసి చిత్తూరు కలెక్టరేట్‌లో 30 రోజుల లోపు ఇవ్వాలని పేర్కొన్నారు.
పుంగనూరు 6 మండలాల బదిలీ నోటిఫికేషన్


