● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశేష కృషి ● జన్యు సామర్థ్యపు విత్తన కోడెల ఉత్పత్తిలో ముందడుగు ● సంకరజాతి పశువుల అభివృద్ధే లక్ష్యంగా పరిశీలన పథక కేంద్రం శాస్త్రవేత్తల కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశేష కృషి ● జన్యు సామర్థ్యపు విత్తన కోడెల ఉత్పత్తిలో ముందడుగు ● సంకరజాతి పశువుల అభివృద్ధే లక్ష్యంగా పరిశీలన పథక కేంద్రం శాస్త్రవేత్తల కార్యాచరణ

May 1 2025 1:52 AM | Updated on May 1 2025 1:52 AM

● ఉత్

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశే

లక్ష్య సాధన దిశగా కేంద్రం

జిల్లాలో 2013–14 కేంద్రం ప్రారంభం నుంచి ఈ పథకం లక్ష్యం కోసం అధికారులు కృషి చేస్తున్నారు. మంచి పాడి వృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇ ప్పటివరకు 305 విత్తనపు కోడెలను పరీక్షకు పెట్టా రు. అలాగే పాల దిగుబడికి 38,807 ఆవులను న మోదు చేశారు. 420 హెచ్‌జీఎం కోడె దూడలను ఉ త్పత్తి చేశారు.

పాడి పంటలు..వ్యవసాయ కుంటుబాలకు రెండు కళ్లు. పంట సాగులో నష్టమొస్తే కర్షకులను పాడి పశువులు కామధేనువుల్లా ఆదుకుంటున్నాయి. అలాంటి పాడి సంపద ఉత్తమంగా ఉంటే రైతులు ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత నిస్తాయి. ఇందుకు ఉత్తమ విత్తన కోడెల ఎంపికే లక్ష్యంగా చిత్తూరు కేంద్రంగా పశుసంతతి పరిశీలన కేంద్రం ఏర్పాటు అయ్యింది. ఈ కేంద్రం ఉత్తమ కోడెల ఎంపికలో లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. అత్యుత్తమ విత్తన కోడెలు, ఆవులను వృద్ధి చేసి, పాడి సమృద్ధికి పాటుపడుతోంది. అన్నదాతలకు అండగా నిలుస్తోంది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పాల దిగుబడి పెంపే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, దృఢమైన సంకరజాతి పశు సంపదను ఉత్పత్తిలో జిల్లాలోని పశు సంతతి పరిశీల న పథక కేంద్రం ప్రధాన భూమిక పోషిస్తోంది. వీర్య కేంద్రాల్లోని విత్తన కోడెలను పరిశీలించి, తద్వారా అ త్యధిక జన్యుసామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉ త్పత్తి చేయడంలో ఈ కేంద్రం ముందు వరుసలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్ర మలో మేలు జాతి సంతతిని పెంచుతూ పాడి పరిశ్రమాభివృద్ధికి కృషిలో గుర్తింపు పొందింది. విత్తన కోడెలను ఉత్పత్తి చేయడంలో లక్ష్యాన్ని అధిగమిస్తోంది.

ఉత్తమ కోడెల ఎంపిక ఇలా..

రాష్ట్రంలోని నంద్యాల, బనవాసి, విశాఖపట్నంలోని వీ ర్య కేంద్రాలతోపాటు దేశంలోని పలు వీర్యకేంద్రాల్లోని విత్తనపు కోడెల నుంచి వీర్యాన్ని సేకరించి, ఆ వీర్య నాళికలను చిత్తూరులోని పశు సంతతి పరిశీలన పథక కేంద్రానికి పంపుతారు. ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల పశువులకు ఆ వీర్యనాళికలను కృత్రిమ గర్భధారణ చేస్తారు. ఆ పశువు ఈ నిన దూడలను పర్యవేక్షిస్తారు. ఆ పేయదూడలు పెద్ద వై ఈనిన తరువాత పాలిచ్చే సమయంలో వాటి పాల దిగుబడిని కొలిచి, విత్తనపు కోడెల సామర్థ్యాన్ని లెక్కి స్తారు. వీటిలో మంచి పాల దిగుబడి వచ్చిన పశుసంపద జననానికి కారణమైన కోడెను నిరూపితమైన కో డె(ప్రూవింగ్‌ బుల్‌)గా గుర్తిస్తారు. ఈ కోడెకు పుట్టిన పేయదూడలను ఉత్తమ ఆవులు(ఎలైట్‌ డాటర్‌) అంటారు. ఇలా ఈ కేంద్రంలో ఏటా సుమారు 20 విత్తన కోడెల వీర్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో మంచి ధృఢమై న 2–4 కోడెలను ఎంపిక చేస్తారు. అలాగే పాల దిగుబడిని కొలవడం ద్వారా అత్యధిక పాల దిగుబడి ని చ్చే ఆవులను గుర్తించడంతోపాటు ప్రూవింగ్‌ బుల్‌కు పుట్టిన కోడె వీర్యాన్ని, పేయ దూడలకు గర్భ ధారణ చేయించి, వాటికి పుట్టిన పశుసంపదను అత్యుత్తమ పశుసంపదగా పరిగణిస్తారు. మగ దూడలైతే హెచ్‌జీఎం(హైజెనిటిక్‌ మెరిట్‌) విత్తన కోడెలుగా పరిగణిస్తా రు. ఈ హెచ్‌జీఎం విత్తను కోడెలను ప్రభుత్వం రైతు లకు మంచి ధర చెల్ల్లించి, కొనుగోలు చేసి, దేశంలోని వీర్య కేంద్రాలకు సరఫరా చేస్తుంది.

సంవత్సరం పరీక్షకు పెట్టిన పాలదిగుబడి ఉత్పత్తి చేసిన

విత్తన కోడెల నమోదు చేసిన హెచ్‌జీఎం కోడె సంఖ్య ఆవులు దూడల సంఖ్య

2013–14 20 567 0

2014–15 25 3129 9

2015–16 30 925 25

2016–17 30 1255 49

2017–18 30 4130 55

2018–19 18 2431 36

2019–20 18 2034 0

2020–21 20 3635 10

2021–22 22 6555 31

2022–23 23 6041 108

2023–24 23 3584 79

2024–25 23 4518 49

భవిష్యత్‌ దృష్ట్యా...

పాల నమోదు కార్యక్ర మం ద్వారా అధిక పాల దిగుబడినిచ్చే ఉత్తమ ఆవులను గుర్తిస్తున్నాం. దేశంలోని అన్ని వీర్య కేంద్రాల్లోని సంకర జాతి జెర్సీ–సహివాల్‌ జాతి విత్తనపు కోడెలను పరీక్షిస్తున్నాం. అత్యధిక జన్యుసామర్థ్యం కలిగిన కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నాం. రాబోవు తరాల్లో సంకరజాతి జెర్సీ ఆవుల పాడి ఉత్పాదక జన్యు సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

– వాసు, జిల్లా పశుసంతతి పరీశీలన కేంద్ర డీడీ, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌, చిత్తూరు

ఇదీ ఉద్దేశం..

జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) ద్వారా సంకరజాతి జెర్సీ ఆవుల్లో ఎన్‌డీపీ–1 స్కీం కింద పశుసంతతి పరిశీలన పథకాన్ని 2013–14 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది 2018–19 వరకు కొనసాగింది. తరువాత 2019–20 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ (ఆర్‌జీఎం) కింద అమలు చేస్తున్నారు. సంకర జాతి జెర్సీ ఆ వుల్లో జన్యుపర్యంగా పాడి ఉత్పాదక శక్తిని పెంపొందించడం, వీర్య కేంద్రంలో ఉన్న విత్తనపు కోడెలను (బ్రీడింగ్‌ బుల్స్‌) పరిశీలించి, వాటి ద్వారా అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

చిత్తూరు కేంద్రంగా...

చిత్తూరు నగరంలోని కలెక్టరేట్‌ సమీపంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తోంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెర్సీ–సహివాల్‌ జాతి సంకర ఆవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంకర ఆవులు మంచి రోగ నిరోధక శక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి పాల దిగుబడికి పేరు గాంచాయి. అందుకే రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు.

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశే1
1/2

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశే

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశే2
2/2

● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement