పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి హా మీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి అర్హత, ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ సంయుక్తంగా పండ్ల తోటల పెంపకం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఐదువేల ఎకరాలలో పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామన్నారు. మామిడి, జామ, కొ బ్బరి, దానిమ్మ, అల్ల నేరేడు, చింతకాయ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జామ, జామ (బ్లాక్, బండ్), సీతాఫలం (బ్లాక్, బండ్), యాపిల్ బెర్రీ, కొబ్బరి, మల్లె పూలు, రోజా, మునగ, ఆయిల్‌పామ్, జీడిపప్పు, తైవాన్‌జామ, అంజీర, చింత, బండ్ ప్లాంటేషన్ తదితర పండ్ల మొక్కలు పెంపకం చేపట్టవచ్చన్నారు. అలాగే పూల సాగుకు సంబంధించి మల్లె, రోజా పంటలపై ఆసక్తిగల రైతులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన చిన్న, సన్నకార రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండల పరిధిలోని ఉపాధి హామీ పథక కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు.
పూడి రైల్వే గేట్ వద్ద
స్తంభించిన ట్రాఫిక్
వడమాటపేట (విజయపురం): పూడి రైల్వే గేటు వద్ద శుక్రవారం గేటు దాటే క్రమంలో అటువైపు వచ్చిన లారీ పైభాగం ప్రమాద ఘంటికలు సూచించే పైపునకు తగులుకోవడంతో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో వాహనాలు రోడ్డుపై చాలావరకు ఆగిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్‌కు తెలపడంతో అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది ప్రమాద ఘంటికల సూచీని తొలగించడంతో లారీ ముందుకు కదిలింది. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియరైంది.
పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు


