● జిల్లాలో 264 మందిని మార్చి ఆ నెపం నాపైకేస్తే ఎట్లా?
● పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి
పలమనేరు: తాను పుంగనూరులో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులను మా ర్చమంటే జిల్లాలోని 264 మందిని మార్చమన్నానా? అని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరులని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ని ర్వహించిన నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నా వల్ల జి ల్లాలోని పోలీసులను బదిలీ చేశారనుకుని, వారి కుటుంబ సభ్యుల తిట్లు నాకు అవరస మా. మేము అధికారంలోకి వచ్చి తొమ్మిది నె లలవుతాంది. మాకు అనుకూలంగా ఉన్న వా రిని వేయమన్నాను. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు వారికి అనుకూలంగా ఉన్న పోలీసులను వేయించుకోవడం సా ధారణ విషయమే. రాజకీయ పార్టీలు ఐదేళ్లుంటాయి, మళ్లీ వేరే పార్టీ రావచ్చు కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. నేను ఈ ప్లగ్ తీసి ఆ ప్లగ్ పెట్టబ్బా కరెంట్ ఇక్కడ మలగాలి కదా? అంటే ఎక్కడో తమిళనాడు బోర్డర్‌లో ఉండే ప్లగ్‌లో పెట్టమన్నానా?. జిల్లాలో 264 మందిని మార్చి ఆ నెపం నాపైకేస్తే ఎట్లబ్బా’ అని జిల్లా ఎస్పీనుద్దేశించి మాట్లాడారు.