చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రం సమీపంలో మురుకంబట్టులోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భార్గవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరంలో మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో (బ్యాక్‌లాగ్) సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముస్లిం (బీసీ–ఈ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టటెడ్ క్రిస్టియన్) విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దర ఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
మహిళా ఉద్యోగులు సమస్యలుంటే తెలపండి
● కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పెట్టె ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఏవైనా సమస్యలుంటే ధైర్యంగా తెలియజేయా లని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను కలెక్టర్, జేసీలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి సమస్యలున్నా ఫిర్యాదు పెట్టెలో లేఖ రూపంలో తెలియజేయవచ్చని చెప్పా రు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మోహన్ కుమా ర్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఏపీ జేఏసీ మహిళా విభా గం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు జయంతి, జనరల్ సెక్రటరీ లత, కో చైర్మన్ శోభ, మెంబర్ సెక్రటరీలు సరిత, పుష్పలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
‘సీఎంసీ’లో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో ఉన్న సీఎంసీ ఆసుపత్రుల్లో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించిందని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంసీ ఆసుపత్రుల్లో విశ్రాంత ఉద్యోగులు హెల్త్ కార్డులతో మెడికల్ రీయింబర్స్‌మెంట్ పొందవచ్చన్నారు. చిత్తూరు సీఎంసీ ఆసుపత్రిలో ఈ ఏడాది మార్చి 2వ తేదీ నుంచి 2028వ సంవత్సరం మార్చి 2వ తేదీ వరకు, వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో 2027 జూన్ 22 వరకు, రాణిపేట ఆసుపత్రిలో 2028 మార్చి 2వ తేదీ వరకు వైద్య చికిత్సలు పొందేందుకు ప్రభుత్వం గుర్తింపు కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నిక
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల్లోని పలు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పదవులకు ఈనెల 27వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి రూర ల్, సదుం, తవణంపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, పెనుమూరు, పీలేరు మండలాల్లో కో ఆప్షన్ సభ్యులకు ఎన్నిక నిర్వహించనున్నారు. తిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విధితమే. అదే విధంగా సదుం ఎంపీపీ ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందారు. తవణంపల్లి ఎంపీపీ గీత తన పదవికి రాజీనామా చేయడం వల్ల ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.