
ఘనంగా ‘ప్రపంచ సోషల్ వర్క్ డే’
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ పి.తవితా తులసి ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ సోషల్ వర్క్ డే ఘనంగా నిర్వహించారు. అకడమిక్ గాంధీయన్ స్టడీస్ ఈడీ గోపాల కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీఇంటర్ జనరేషనల్ సోలిడారిటీ క్రియేటింగ్ ఏ వరల్డ్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఆల్ఙ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్ కేవీ రమణ, ఆంధ్ర బెస్ట్ విమెన్ అవార్డు గ్రహీత కమల, ప్రొఫెసర్ అనురాధ, డాక్టర్ లలిత కుమారి పాల్గొన్నారు. అలాగే ఎస్వీయూలో సోషల్ వర్క్‌డే నిర్వహించారు. ప్రిన్సిపల్ సుధారాణి, సెట్విన్ మేనేజర్ మోహన్, ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య, డాక్టర్ రీనా, డాక్టర్ సునీల్, డాక్టర్ కోదండరెడ్డి పాల్గొన్నారు.