కార్వేటినగరం : రేసు కుక్కలు (అడవి కుక్కలు) దాడి చేసి 10 మేకలను బలి తీసుకున్న సంఘటన మండల పరిధిలోని టీకేఎం పేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా.. టీకేఎం పేట గ్రామానికి చెందిన ఏసునాధ, సుందరమ్మకు చెందిన మేకలను ఇంటి ఆవరణలో ఉంచగా గురువారం రాత్రి రేసు కుక్కలు దాడిచేసి ఏసునాధన్‌ఽకు చెందిన 6 మేకలను, అలాగే సుందరమ్మకు చెందిన 4 మేకలపై దాడి చేసి గాయపరచడంతో 10 మేకలు మృతి చెందాయి. మేకలపై ఆధారపడి జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు.