
బైక్‌ను ఢీకొన్న కారు..ఒకరి మృతి
గంగవరం: ముందు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గంగవరం మండలంలో శుక్రువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆలకుప్పం గ్రామానికి చెందిన నరేష్(28), విజయ్(24) బైక్‌లో పలమనేరుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిలో గోవిందశెట్టిపల్లి గ్రామం వద్ద బెంగళూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌లో వెనుక కూర్చున్న నరేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందగా బైక్ నడుపుతున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు ద్విచక్రవాహనాల ఢీ.. మరొకరు..
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడ మార్గంలో రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఢీకొనడంతో తమిళనాడువాసి మణి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం ఈడిగపల్లెకు చెందిన మణి(55) సొంతపని పాలసముద్రం గ్రామానికి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యాడు. పాలసముద్రం దళితవాడ నుంచి గుండుబావి వద్ద హోట్‌లో భోజనం పార్శిల్ తీసుకువెళ్లడానికి విజయ్‌కుమార్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తుండగా మార్గం మధ్యలోని మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈడిగపల్లెకు చెందిన మణి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయ్‌కుమార్‌ను 108లో ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని, పరిశీలించారు. మణి కుమారుడు ఉదయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డిప్ప తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గంగవరం మండలంలో కారు బైక్‌ను ఢీకొని ఒకరు, పాలసముద్రం మండలంలో రెండు బైక్‌లు ఢీకొని మరొకరు దుర్మరణం చెందారు.