బాబూ వచ్చే.. జాబు రాదే? | - | Sakshi
Sakshi News home page

బాబూ వచ్చే.. జాబు రాదే?

Mar 12 2025 7:59 AM | Updated on Mar 12 2025 7:56 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ వివరాలు ఇలా... నియోజకవర్గం విద్యార్థులు పెండింగ్‌ మొత్తం (రూ. కోట్లల్లో) చిత్తూరు 2,517 4,82,02,359 నగరి 3,444 6,20,96,235 పుంగనూరు 4,694 8,76,63,867 పూతలపట్టు 3,006 6,28,15,905 పలమనేరు 4,252 6,99,16,920 కుప్పం 3,049 5,04,42,063 గంగాధరనెల్లూరు 3,187 6,64,84,512 మొత్తం 24,149 44,76,21,861

‘చంద్రబాబుకు ముని శాపం ఉంది. నిజం చెబితే తల వేయి ముక్కలవుతుంది. అందుకే ఆయన నిజం చెప్పరు. చెప్పింది చేయరు’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు అక్షరసత్యమని పదేపదే రుజువు చేస్తున్నారు. ఎన్నికల ముందు అంతన్నారు..ఇంతన్నారు.. అధికారంలోకి రావడమే ఆలస్యమన్నారు.. జాబు కావాలేంటే బాబు రావాలన్నారు.. అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా నిరుద్యోగులకు జాబు మాత్రం రాకపోయే అని నిరుద్యోగ యువత నిట్టూర్చుతోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : అలవికానీ హామీలు ఇవ్వడం.. ఆ తరువాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అధికారంలోకి వస్తే ఇంటింటికీ ఉ ద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఆయన సీఎం అయ్యాక మొ హం చాటేశారు. కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఒక ఉద్యోగం కానీ.. రూపాయి నిరుద్యోగ భృతి కానీ ఇచ్చివుంటే ఒట్టు. దీంతో నిరుద్యోగుల పరి స్థితి దయనీయంగా మారింది. చిత్తూరు జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఐటీఐ, నర్సింగ్‌, పాలి టెక్నిక్‌, మెడకల్‌, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాల ల్లో 64,789 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరితోపాటు ఇప్పటికే డిగ్రీలు పుచ్చుకుని డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం సుమారు 45 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు అయినకాడికి అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు.

4 లక్షలు కాదు కదా.. 4 పదుల ఉద్యోగాల్లేవ్‌!

జిల్లాలోని యువత చంద్రబాబు అండ్‌ కో చేతిలో మరోసారి మోసపోయింది. ఏడాదికి 4 లక్షలు కాదు కదా కొత్తగా 4 పదుల సంఖ్యలోనైనా ఉద్యోగాల భర్తీని కూటమి టీడీపీ చేపట్టలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేశారు. మెగా డీఎస్సీ దగా చేసేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ బాట పట్టిస్తున్నారు. రూ.5 వేలు కాదు కదా రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారి ఉద్యోగాలు తొలగించి, కడుపులు కొట్టారు. ఇక నిరుద్యోగ భృతి హామీ కూడా టీడీపీ 2014–19 పాలన మాదిరిగానే ప్రస్తుతం ఎగనామం పెట్టేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపారు.

కళాశాల విద్యార్థులకు మొండిచేయి..

మరోవైపు ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా మోసం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలోని 64,789 మంది ఉ న్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తించేది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో నిరాటంకంగా అమలు చేసిన జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను టీడీపీ కూటమి అటకెక్కించారు. ఫలితంగా జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భరోసా

గత వైఎస్సార్‌సీపీ నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలిచింది. అమ్మఒడి పథకం ద్వారా ఐదేళ్లలో జిల్లాలోని 2,49,348 మంది తల్లుల ఖాతాలకు రూ.1458.9 కోట్లు జమ చేశారు. జిల్లాలోని 1,89,789 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.879.33 కోట్లు, వసతి దీవెన పథకం కింద 1,78,148 మందికి రూ.245.36 కోట్లు సాయం అందించింది. నిర్ణీత సమయంలో ప్రభుత్వం ఫీజులు అందించడంతో తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండేవారు.

నేడు వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’

యువత, విద్యార్థులను కూటమి ప్రభుత్వం చేస్తు న్న అన్యాయాన్ని ఎండగడుతూ వారి పక్షాన బుధవారం ‘యువతపోరు’ నిర్వహించేందుకు వైఎస్సా ర్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమ లు చేయాలని డిమాండ్‌ చేస్తూ యువత, విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌కు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.

ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల ఆశలు ఆవిరి ఊసేలేని నిరుద్యోగ భృతి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో విద్యార్థులకు టోపీ అధికారం కోసం బాబు, పవన్‌ బూటకపు హామీలు నిరుద్యోగులు, ఉన్నత విద్యార్థుల పక్షాన వైఎస్సార్‌ సీపీ నేడు కలెక్టరేట్‌ ఎదుట ‘యువతపోరు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement