
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం నాలుగో రోజు 36 మంది 39 సెట్ల నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేశారు. జిల్లాలోని చిత్తూరు పార్లమెంట్, మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్‌లు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఏడు సెట్లు నామినేషన్‌లను దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఆర్‌ఓ షణ్మోహన్‌కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ తరపున రెడ్డెప్ప 2 సెట్లు, ఆయన భార్య రెడ్డెమ్మ 2 సెట్లు, నాగేశ్వరరావు (జాతీయ జనసేన పార్టీ) –1 సెట్, జానకిరామారావ్ (నేషనల్ మహాసభ పార్టీ)–1, చిట్టిబాబు (కాంగ్రెస్) –1 సెట్ నామినేషన్ వేశారు. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో ప్రభాకర్‌రెడ్డి (ఇండిపెండెంట్), ప్రతిమ (టీడీపీ–2 సెట్లు), ఇందుమతి (వైఎస్సార్‌సీపీ తరపున)–2 సెట్లు, ఇండిపెండెంట్–2 సెట్లు), తుకారామ్–1 (కాంగ్రెస్) నామినేషన్‌లను ఆర్‌ఓ శ్రీనివాసులుకు అందజేశారు. పుంగనూరు నియోజకవర్గంలో 5 మంది అభ్యర్థులు 5 సెట్లు, నగరిలో ఒక అభ్యర్థి, జీడీ నెల్లూరులో నలుగు గురు అభ్యర్థులు, పూతలపట్టులో 6 మంది అభ్యర్థులు 7 సెట్లు, పలమనేరులో 6 మంది అభ్యర్థులు 6 సెట్లు, కుప్పంలో 6 మంది అభ్యర్థులు 6 సెట్లు నామినేషన్‌లను ఆయా ఆర్‌ఓలకు సమర్పించారు. కుప్పంలో భరత్ తరఫున (వైఎస్సార్‌సీపీ) ఆయన సతీమణి దుర్గ నామినేషన్ అందజేశారు.

