నవరత్నాలు గిర్ర్‌ర్ర్‌ర్ర్‌... సూపర్‌ సిక్స్‌ తుర్ర్‌ర్ర్‌ర్ర్‌ | Sakshi
Sakshi News home page

నవరత్నాలు గిర్ర్‌ర్ర్‌ర్ర్‌... సూపర్‌ సిక్స్‌ తుర్ర్‌ర్ర్‌ర్ర్‌

Published Fri, Apr 19 2024 1:55 AM

- - Sakshi

ఏమబ్బా! ఆయన ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ ఇదేమన్నా ప్రకాశం..ఒంగోలు అనుకున్నాడా ఏందీ? కార్యకర్తలను ఓ అని సతాయిస్తావుండాడే. ఎలక్షన్లు అందరికీ తెలుసూ. చంద్రబాబు చెప్పిన సూపర్‌ సిక్స్‌ పథకాల హామీల గురించి జెనాలకు చెబుతావుంటే వాళ్లినాలి కదా! వాటి గురించి జెనాలకు చెప్పండా.. చెప్పాండా.. అని శ్రీకాంత్‌ అంటావుండారు..జెనంలో అయితే రెస్పాన్సు లేదప్పా.. మొన్న మావూర్లో ప్రచారం చేస్తిమా...చంద్రబాబును గెలిపిచ్చి సీఎం చేస్తే తల్లికి వందనం కింద 20 వేలు ఇస్తారని చెప్తిమా..ఆయమ్మ ఏమనిందో గుర్తుంది కదా!?.. మాకు అమ్మఒడి కింద జగనన్న 15 వేలిస్తాండాడు..అని నవ్వాతా చెప్పి తలుపేసుకుని ఇంట్లోకి ఎల్లిపాయె. జనాలు ముందు మాదిరిగా లేదప్పా .. చాలా వుషారుగా ఉండారు..జగనను ఎన్నో ఇస్తాండాడు..ఇప్పుడు ఆయన పథకాలకు పేర్లు మార్చి, ఇంక కొత్తగా మీరిచ్చేదేందప్పా? అని ఆడోళ్లు ముకానే అడగతాండారు. ఆ మాదిరి చెప్తే తలకాయ యాడబెట్టుకోవాల? జెనం మైండులో జగను పథకాలే తిరగతాండాయప్పా.. సూపర్‌ సిక్స్‌ లేదప్పా..ఈ శ్రీకాంతు సారేమో జెనాలకు చంద్రబాబు పథకాల గురించి చెప్పండా.. చెప్పండా.. అని చాలా ఇబ్బంది పెడుతావుండాడు. అన్నదాత కింది చంద్రబాబు 20 వేలు ఇస్తాడని ఊళ్లో జెనాలకు పాంప్లేట్‌ ఇస్తే..మాకు రైతు భరోసా వస్తాందిలే అని ఆడోళ్లే చెప్తాండారు. జగన్‌ మోహన్‌రెడ్డి తైక్కుమంటే చాలు..పుసుక్కుమని బటను నొక్కి పథకాల డబ్బులు ఎన్నోసార్లు వేసి ఉండాడు.. అందుకే ఆడోళ్లు, మగోళ్ల మైండ్లలో జగను పథకాలన్నీ గిర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్‌..మని ఫ్యానులాగ తిరగతాండాయప్పా..మనవేమో తుర్ర్‌ర్ర్‌ర్ర్‌మంటాడాయప్పా..చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ బటనూ నొక్కలా..! జన్మభూమి కమిటీలు చెప్పినోళ్లకే ఇచ్చినారు..అదే పెద్ద మైనస్సప్పా..మనం ఏం జెప్పినా చంద్రబాబు కన్నా ఇప్పటి ప్రభుత్వమే బాగా చేస్తాందని ఓటర్లు చెప్పేస్తాండారప్పా.. జగన్‌ పార్టీ కూడా స్త్రాంగైంది.. విలేజీల్లో ముందు మాదిరిగా లే..మన లీడర్లకు ఇది చెబితే పట్టించుకోరు.’’ భువనేశ్వరి వచ్చి నామినేషన్‌ వేసినా ఇంతేప్పా.. అని నిట్టూర్చారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ కార్యాలయం మీటింగ్‌ అయినా తరువాత నలుగురు కార్యకర్తల మధ్య బస్టాండులో పిచ్చాపాటీగా సాగిన సంభాషణ ఇది. ప్రజల్లో వైఎస్సార్‌ సీపీ పథకాలు ఎంత బలంగా ఉన్నాయో, వాటి ప్రభావం ఎంతగా ఉందో ఈ సంభాషణ చెప్పకనే చెప్పింది.

–కుప్పం

Advertisement
 
Advertisement
 
Advertisement