
సుబ్రమణ్యం(ఫైల్)
పుంగనూరు: ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాల విద్యార్థిని కేపీ అతికున్నిసా 979 మార్కులు సాధించి స్టేట్‌లో టాపర్‌గా నిలిచిందని ప్రిన్సిపాల్ వాసియా ఫర్హత్ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో 33 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. వారిలో 28 మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. కేపీ అతికున్నిసా 979 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిందని, అజ్మియాభాను 954, సబానాజ్ 944 మార్కులు సాధించారని పేర్కొన్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో యాస్మిన్ 484, కళ్యాణి 479, మెహతాజ్ 476 మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు.
ఐచర్ వాహనం ఢీకొని డ్రైవర్ మృతి
పలమనేరు: పట్టణ సమీపంలోని జగమర్ల క్రాస్ వద్ద చైన్నె– బెంగళూరు హైవేలో శనివారం మినీ టెంపోను ఐచర్ వాహనం ఢీకొంది. దీంతో డ్రైవర్ మృతిచెందాడు. బైరెడ్డిపల్లి మండలం దాసార్లపల్లికి చెందిన గౌతంరాజు మినీ టెంపోలో టెంకాయలు లోడు చేసుకుని బంగారుపాళెం వైపు వెళుతున్నాడు. మొగిలి ఘాట్‌లో అల్యూమినియం లోడుతో బెంగళూరు వైపు వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొంది. డ్రైవర్ గౌతం రాజు మృతిచెందాడు. పక్కనే ఉన్న కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
పుత్తూరు: మండలంలోని మజ్జిగ గుంట వద్ద శనివారం తెల్లవారు జామున కారు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తడుకు పంచాయతీ వేణుగోపాలపురం గ్రామానికి చెందిన బి.సుబ్రమణ్యం(60), నరసింహులు మందడి పనిమీద తిరుపతి బయలుదేరారు. మజ్జిగగుంట వద్ద నడిచి వెళ్తున్న సుబ్రమణ్యంను కారు ఢీకొని వెళ్లిపోయింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహులు మందడి ఈ విషయాన్ని గ్రామస్తులు, పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. నెల్లూరు సమీపంలోని తడ వద్ద పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అధిక మార్కులు సాధించిన విద్యార్థులు