
డిప్యూటీ సీఎం నారాయణస్వామితో తోటానుపల్లె గ్రామస్తులు
వెదురుకుప్పం : ‘‘జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాం...మేమంతా ఎప్పటికీ మీ వెంటే ఉంటాం.. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేదుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ జడబాపనపల్లె, తోటానుపల్లె దళితవాడ వాసులు ముక్త కంఠంతో చెప్పారు. ఆ రెండు గ్రామాల వారు టీడీపీలో చేరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం సాయంత్రం ఆయా పల్లెల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీ కండువాలు వేసుకుని తమ మద్దతు తెలిపారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎస్సీల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పేదల తలరాతలు మారుస్తున్న సీఎం జగనన్నను ఆదరించాలని డఓటును అమ్మకోవద్దని సూచించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షుడు రామయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, మాజీ ఎంపీపీ పురుషోత్తం, ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్, సర్పంచ్‌లు గోవిందయ్య, రాజశేఖర్‌రెడి, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేష్ పాల్గొన్నారు.
