
ర్యాండమైజేషన్‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ షణ్మోహన్
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పకడ్బందీగా ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు పంపించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను ర్యాండమైజేషన్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కట్టుదిట్టమైన నిఘా నడుమ తొలి విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి అవ్వగానే కలెక్టరేట్‌లోని ఎన్నికల గోడౌన్‌లో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్రపరిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్‌ఓ పుల్లయ్య, ఈవీఎం మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి శ్రీదేవి, రాజకీయపార్టీల ప్రతినిధులు ఉదయ్, భాస్కర్, అట్లూరి శ్రీనివాసులు, సురేంద్ర పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ నిధులతో నీటి వనరులకు మరమ్మతులు చేయించుకోవాలన్నారు. ప్రజలు, ఉపాధీ కూలీలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీడీఓలు బాధ్యతగా పనిచేసి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరులో నీటి సమస్య ఉంటుందని, నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ గ్లోరియా, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, డీపీఓ లక్ష్మి పాల్గొన్నారు.