
టీడీపీ కార్యకర్తలకు కండువా వేస్తున్న సునీల్‌కుమార్
పలమనేరు : సీమాంధ్ర జిల్లా స్టూడెంట్స్ విభాగం నాయకుడు హేమంత్ చౌదరి శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హేమంత్‌కుమార్ రెడ్డి, నాయకులు మండీ సుధా, రాజేష్, జగ్గ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
బంగారుపాళెం: మండలంలోని నల్లంగాడుకోటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఈ మేరకు ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్, పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఛాయాపతి, అరుణాచలం, భాను, ఎస్.బాబు, విజయ్, ఆనంద్, చిరంజీవి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పాలఏకరి కార్పొరేషన్ ఛైర్మన్ కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొన్నారు.

హేమంత్ చౌదరికి కండువా వేస్తున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ