మెరుగైన ఫలితాలు
ఇంటర్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టాం. అనుకున్న మేర కాకున్నా కొంత మెరుగైన ఫలితాలే వచ్చాయి. పిల్లలను మార్కులు, ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులువేధించకూడదు. పక్క పిల్లలతో పోల్చి కించపరచకూడదు. ఎన్ని మార్కులు వచ్చినా పిల్లలను, చదివిన చదువును గౌరవించండి. ఫెయిల్ అయితే సప్లిమెంటరీలో మంచి మార్కులు వచ్చేలా ప్రోత్సహించండి. విద్యార్థులు క్షణికావేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ఎంతో భవిష్యత్ ఉందనే విషయాన్ని గుర్తించాలి.
– సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈఓ