4న కాణిపాకంలో పలు ప్రారంభోత్సవాలు | Sakshi
Sakshi News home page

4న కాణిపాకంలో పలు ప్రారంభోత్సవాలు

Published Sat, Mar 2 2024 12:15 PM

మాట్లాడుతున్న మోహన్‌ రెడ్డి, వెంకటేశు   - Sakshi

కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 4వ తేదీన పలు భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు తెలిపారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ సుమారు రూ.60 కోట్లతో నిర్మించిన పలు భవనాలను సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మంత్రులు మంత్రి కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, కలెక్టర్‌ షణ్మోహన్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వరసిద్ధుని ఆలయంలో రూ.8.5 కోట్లతో బంగారుతాపడం పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే రూ.3.5 కోట్లతో మూషిక మండపంలో వెండి వాకిలికి సిద్ధం చేసినట్లు వివరించారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అర్చకుడు శేఖర్‌ గురుకుల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement