రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఆయుష్షు పోస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో వెలుగునింపుతోంది. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తోంది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య భాగ్యం కల్పిస్తోంది.
ఆరోగ్య శ్రీ వ్యయ పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షల వరకు ఉండగా ఇప్పుడు ఆపై వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయ పరిమితి పెంపు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పేదలకు ఆరోగ్య శ్రీ మరింత రక్షగా నిలవనుంది.


