దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Mon, Nov 20 2023 12:36 AM

-

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారు ప్రధానమంత్రి విశ్వకర్మయోజన రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనా రిటీ కార్పొరేషన్‌ ఈడీ చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముస్లింలు, దూదేకులు, క్రిస్టియన్లు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ చేతి వృత్తి పనివారు, హస్తకళల నిపుణులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పరికరాల కొనుగోలుకు ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు. అలాగే స్వర్ణకారులు, కా ర్పెంటర్లు, శిల్పకారులు, కొలిమి, బుట్టలు, చాపలు, పరకలు అల్లేవారు, చెప్పులు కుట్టేవా రు, దోబీ, కుమ్మరి, టైలర్లు, తాపీ కార్మికులు, బార్బర్‌, రాళ్లు కొట్టేవారు, బొమ్మలు తయారీ చేసేవారు, పూలదండలు, తాళాల తయారీదారులకు కూడా ఈ పరికరాలు అందిస్తారన్నా రు. ఈ పథకం ద్వారా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు 5 శాతం వడ్డీతో (తిరిగి చెల్లించే పద్ధతి) బ్యాంకుల ద్వారా రుణసహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలని చెప్పారు. ఐదేళ్లలోపు పీఎంఈజీపీ, పీ ఎం ముద్ర వంటి రుణాలను పొంది తిరిగి చె ల్లించని వారు అనర్హులన్నారు. ఈ పథకం కు టుంబంలో ఒక్కరికే మాత్రమే వర్తిస్తుందని చె ప్పారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉ ద్యోగి ఉంటే పథకం వర్తించదన్నారు. వివరాలకు www.pmvishwakarma.gov.in వెబ్‌సైట్‌లో కానీ, కలెక్టరేట్‌లోని మైనారిటీ కా ర్పొరేషన్‌ కార్యాలయంలో కానీ సంప్రదించాలన్నారు.

నేడు కలెక్టరేట్‌లో స్పందన

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజా సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ష ణ్మోహన్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేసి, పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్పందన కా ర్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నా రు. గైర్హాజరైతే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Advertisement