
సదుం: మంత్రి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు
సదుం: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీకి ఎనలేని ఆదరణ లభిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని చీకలచేనులో టీడీపీ నాయకులు నటరాజ, చంద్ర, నాగరాజు, శివ తదితరులతో పాటు ఇరవై మంది మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారీకి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని మంత్రి చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, గణేష్‌రెడ్డి, శ్రీరాములు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.