
ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు
పుంగనూరు: బ్రిటీష్ పాలకులను గజగజలాడించిన స్వాతంత్య్ర సమరయోధుడు, మైసూర్ కా షేర్ టిప్పు సుల్తాన్ అంటూ వేలాది మంది ముస్లింలు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకుడు అస్లాం మురాధి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేలాందిమందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కౌన్సిలర్ అర్షద్ అలి, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖాన్, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. సీఐ రాఘవరెడ్డి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. పోలీసులు బందోబస్తు చేపట్టి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
చిగరపల్లెలో
ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్
చిత్తూరు రూరల్: అటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఆటోమెటిక్ డ్రైవింగ్ ట్రాక్ మాదిరే వాహనాల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు టెస్టింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది. అధికారుల చేతికి పని లేకుండా సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ఈక్రమంలో ఐరాల మండలం చిగరపల్లె వద్ద అటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ భూ సేకరణకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆప్రాంతంలో స్థల పరిశీలన చేశారు. త్వరలో ఈ పక్రియ తెరపైకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
నేత్రపర్వం..వినాయక కల్యాణం
కాణిపాకం(యాదమరి): గుంటూరు సంతోషిమాత ఆలయంలో గణపతి హోమం, కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి కల్యాణం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాక దేవస్థానం, ధర్మప్రచార పరిషత్, సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించిం తరించారు. కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు, సేవ్ టెంపుల్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు