ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే జనరంజక పాలన సాధ్యమని మంత్రి ఆర్కేరోజా, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో రెండో రోజు శుక్రవారం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పండుగ వాతావరణంలో జరిగింది. సంక్షేమం, అభివృద్ధి డిస్‌ప్లే బోర్డులను సచివాలయాల్లో ప్రారంభించారు. కూడలి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలను ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ బావుటా బుక్‌లెట్లను అందజేసి, గత, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజలకు పలు ప్రశ్నలు వేసి ప్రశ్నపత్రంలో టిక్ చేసుకున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తామంతా ‘జగనన్న వెంటే’ అన్ని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా తెలియజేశారు.