లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ షణ్మోహన్‌  - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, అనుబంధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సగిలి షణ్మోహన్‌ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖలైన మత్స్య, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఏపీఎంఐపి, ఉద్యాన,వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా మత్స్య శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, నిర్దేశించిన లక్ష్లాను ఆ శాఖ డీడీ వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టు పరిశ్రమ శాఖ పరిధిలో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం మూడు వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఉద్యానశాఖ ద్వారా రైతులకు మేలు రకమైన కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు, లక్ష్యాలను ఆశాఖ డీడీ కలెక్టర్‌కు వివరించారు. ఇకపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పలమనేరు డివిజన్‌, కుప్పం ప్రాంతంలో 20 వేల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డీఏఓ ను ఆదేశించారు.

కర్ణాటక మద్యం పట్టివేత

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని పాతబస్టాండు ప్రాంతంలో శుక్రవారం అర్బన్‌ ఎస్‌ఈబీ అధికారులు జరిపిన దాడుల్లో సంపత్‌కుమార్‌ (35) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 16 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుడిపాల మండలం 189 కొత్తపల్లెలో 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అనుప్పల్లెకు చెందిన పయణి అరెస్ట్‌ చూపి, రిమాండ్‌కు తరలించారు. సీఐ జోగేంద్ర, ఎస్‌ఐలు బాబు, పృథ్వీ, సిబ్బంది బాబు, శంకర్‌నాయక్‌, పతిలిబాయి, వెంకటేశ్వర్లు, జయశంకర్‌, షమ, జ్యోతి తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top