జిల్లాలోని మామిడి ర్యాంపుల వద్ద తూకాల్లో అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లాలో 33 చోట్ల మామిడి ర్యాంపులున్నాయి. వ్యాపారులు తూకాల్లో మోసం చేయకుండా లీగల్ మెట్రాలజీ శాఖ నుంచి శిక్షణ పొందిన ఆర్‌బీకే సిబ్బంది పర్యవేక్షణలో ఈదఫా మామిడి అమ్మకాలు చేపడుతున్నాం. గిట్టుబాటు ధర లభించాలంటే ఒకేసారి కాకుండా దఫ, దఫాలుగా మార్కెట్ ధరలను అనుసరించి కోతలు కోయాలి. జిల్లాలో మామిడి కాత తక్కువగా ఉన్న కారణంగా ధర ఎక్కువగా పలికే అవకాశం ఉంది. –మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి


