పుతిన్‌కు ఎలన్‌ మస్క్‌ భారీ షాక్‌!

Zelensky Thanks Elon Musk For Supporting Ukraine With Words And Deeds - Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ రష్యాకు భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలస్కీతో మంతనాలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో జెలస్కీ..,ఎలన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

 

రష్యాతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో జెలెన్‌ స్కీ..ఎలన్‌ మస్క్‌తో జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్‌ స్కీ తమదేశానికి రావాలంటూ ఎలన్‌ మస్క్‌ను ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర అంశాలపై చర‍్చలు జరిపారు. ఈ సంభాషణల సమయంలో రష్యా వార్తా వనరులను నిరోధించాలని స్టార్‌లింక్‌ను కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) కోరాయని ఎలన్‌ మస్క్‌ తెలిపారు.

యుద్ధం తర్వాత మాట్లాడుతా!
ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఎలన్‌ అందిస్తున్న శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగిస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతాల్లో స్పేస్‌ ఎక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతూ ఉక్రెయిన్‌ ప్రధాని మస్క్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అంతేకాదు స్పేస్‌ ప్రాజెక్ట్‌ల గురించి ఎలన్‌ మస్క్‌తో చర్చించాను. ఆ చర్చలపై యుద్ధం తర్వాత మాట్లాడతానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మండిపడుతున్న పుతిన్‌  

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని ఎలన్‌ ఖండించకపోయినా.. ఉక్రెయిన్‌కు సహకరిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌కు మింగుడు పడడం లేదని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ కోసం శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు జెలస్కీతో మస్క్‌ సంప్రదింపులు జరపడాన్ని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పేస్‌ ఎక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లపై నిషేధం విధించింది.

చదవండి: ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం: 'పుతిన్‌ను ఎలిమినేట్‌ చేయండి సార్‌'!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top