జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దూకుడు.. మళ్లీ పునీత్‌ గోయెంకానే | Zee Entertainment Q2 Results Net profit jumps 61pc | Sakshi
Sakshi News home page

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దూకుడు.. మళ్లీ పునీత్‌ గోయెంకానే

Oct 19 2024 7:21 AM | Updated on Oct 19 2024 9:06 AM

Zee Entertainment Q2 Results Net profit jumps 61pc

న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీల్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 70 శాతంపైగా దూసుకెళ్లి రూ. 209 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 123 కోట్లు ఆర్జించింది.  

పటిష్ట వ్యయ నియంత్రణల కారణంగా మార్జిన్లు 6 శాతంపైగా మెరుగుపడినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం ఆదాయం 19% క్షీణించి రూ. 2,034 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 2,510 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. పునీత్‌ గోయెంకాను 2025 జనవరి1 నుంచి ఐదేళ్ల కాలానికి ఎండీ, సీఈవోగా బోర్డు తిరిగి నియమించినట్లు జీల్‌ పేర్కొంది. షేరు 5% జంప్‌ చేసి రూ. 132 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement