యూట్యూబ్ కొత్త ఫీచర్.. డీప్‌ఫేక్ వీడియోలకు గుడ్‌బై | Youtube New Feature For AI Deepfake | Sakshi
Sakshi News home page

యూట్యూబ్ కొత్త ఫీచర్.. డీప్‌ఫేక్ వీడియోలకు గుడ్‌బై

Jun 22 2024 6:23 PM | Updated on Jun 22 2024 6:34 PM

Youtube New Feature For AI Deepfake

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న తరుణంలో దాదాపు అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించడానికి ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బలైపోతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్శించడానికి కొంతమంది తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూడటానికి అసలైన వీడియోల మాదిరిగానే ఉండటం వల్ల, అసలైన వీడియో ఏది? నకిలీ వీడియో ఏది, అని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించడానికి యూట్యూబ్ చర్యలు తీసుకుంటోంది, ఇందులో భాగంగానే కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తోంది.

ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను గానీ, వారి వాయిస్ గానీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే వాటిపైన రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాకూండా ఏఐను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేసేవారు తప్పకుండా ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని యూట్యూబ్ పేర్కొంది.

ఏఐను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తే.. యూజర్ల రిపోర్ట్ మేరకు యూట్యూబ్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ కంటెంట్ డిలీట్ చేస్తుంది. ఈ విధంగా డీప్‌ఫేక్ వీడియోలను పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంది. దీంతో డీప్‌ఫేక్ భయానికి లోనయ్యేవారు నిశ్చింతగా ఉండవచ్చు. యూజర్ల భద్రతే ప్రధానంగా భావించిన యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement