యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు | YouTube Down For Users in India | Sakshi
Sakshi News home page

యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు

Jul 22 2024 6:42 PM | Updated on Jul 22 2024 7:06 PM

YouTube Down For Users in India

గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్‌లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్‌లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్‌లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్‌సైట్‌తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.

నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement