ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే.. | you know how much upi transactions in five months | Sakshi
Sakshi News home page

ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..

Sep 21 2024 12:42 PM | Updated on Sep 21 2024 3:20 PM

you know how much upi transactions in five months

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థికశాఖ చెప్పింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుందని పేర్కొంది.

మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18,737 కోట్లకు పెరిగాయి. ఇది ఏటా 44 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరుకుంది. ఇదిలాఉండగా, కేవలం భారతదేశంలోనే కాకుండా దుబాయ్‌, ఖతార్‌, కువైట్‌, మారిషస్‌.. వంటి ఇతర దేశాల్లోనూ ఎన్‌పీసీఐ యూపీఐ సేవలను అమలు చేస్తోంది. దాంతో అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి: ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్‌ తెలుసా..?

ఫిజికల్‌గా డబ్బు ఉంచుకోవడం కంటే డిజిటల్‌ లావాదేవీలు చేయడం మేలని యూపీఐ వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్‌ చేయడం సులభమవుతోంది. కానీ కొన్ని థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వినియోగిస్తుండడంపట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతా వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు అధిక వడ్డీలోన్లను ఆశచూపి భారీగానే లాభపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement