రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే.. | Woman Home Loan Volume and Value Double Digit Growth | Sakshi
Sakshi News home page

రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..

Jun 7 2025 5:55 PM | Updated on Jun 7 2025 8:21 PM

Woman Home Loan Volume and Value Double Digit Growth

గృహాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో గృహ రుణ మార్కెట్‌ కూడా బలపడుతోంది. అర్బన్‌ మనీ గణాంకాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాలలో 2025 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల పంపిణీ పరిమాణం 10 శాతం, విలువలు 15 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా రూ.కోటి కంటే ఎక్కువ టికెట్‌ సైజు ఉన్న రుణాలు ఏడాది కాలంలో గృహ రుణ పంపిణీలో 21 శాతం మేర వృద్ధి చెందాయి. తుది గృహ కొనుగోలుదారుల డిమాండ్, పట్టణీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలతో గృహ రుణాలు సులభతరంగా పంపిణీ అవుతున్నాయి. గృహ రుణ పరిమాణం, విలువలు రెండు అంకెల వృద్ధిని నమోదు స్తోందని అర్బన్‌ మనీ రీసెర్చ్‌ వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

దేశంలోని ప్రధాన నగరాలలో మహిళా గృహ రుణ గ్రహీతలు పెరుగుతున్నారు. ప్రతి ఐదు గృహ రుణాలలో ఒక మహిళా రుణ గ్రహీత ఉంది. గృహరుణ పంపిణీలో పురుషుల వాటా 10 శాతం కాగా.. మహిళ రుణ గ్రహీతల వాటా 9 శాతంగా ఉంది. అదే లోన్‌ అమౌంట్‌లో చూస్తే మగవారి వాటా 14 శాతంగా ఉండగా.. మహిళల వాటా 23 శాతంగా ఉంది. అర్బన్‌ మనీ నివేదిక ప్రకారం ప్రధాన నగరాలలో సగటు రుణం రూ.74 లక్షలుగా ఉంది. ఇది ఏటేటా 5 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.  

సగటు రుణం రూ.70 లక్షలు 
సగటున పురుషులు రూ.76 లక్షల రుణం తీసుకుంటుంటే.. మహిళా రుణ గ్రహీతలు రూ.70 లక్షల రుణం తీసుకుంటున్నారు. పురుషులు తీసుకునే లోన్‌ అమౌంట్‌ ఏటా 3 శాతం వృద్ధి చెందుతుండగా.. మహిళల రుణం ఏకంగా 13 శాతం పెరుగుతోంది. లోన్‌ అమౌంట్‌ వారీగా చూస్తే.. రూ.కోటి కంటే ఎక్కువ రుణం వాటా 21 శాతం కాగా.. రూ.45 లక్షల నుంచి రూ.కోటి మధ్య లోన్‌ వాటా 32 శాతం, రూ.45 లక్షల కంటే తక్కువ లోన్‌ వాటా 47 శాతంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement