విప్రో సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్ | Wipro CFO Jatin Dalal Resigns, Aparna Iyer Named As New Finance Chief - Sakshi
Sakshi News home page

Who Is Wipro New CFO: విప్రో సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ రాజీనామా - ఆ స్థానంలో అపర్ణ అయ్యర్

Published Fri, Sep 22 2023 9:03 AM | Last Updated on Fri, Sep 22 2023 9:34 AM

Wipro CFO Jatin Dalal Resigns New CFO Aparna Iyer - Sakshi

విప్రో (Wipro) కంపెనీలో దాదాపు 20 సంవత్సరాలుగా ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్‌గా (CFO) సేవలందించిన జతిన్ దలాల్ గురువారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ స్థానంలోకి కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న 'అపర్ణ అయ్యర్'ను నియమిస్తున్నట్లు.. సెప్టెంబర్ 22నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అపర్ణ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు దశాబ్దాలుగా నాకు కంపెనీలో అవకాశం కల్పించినందుకు విప్రోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..

2022లో ట్రెజరీ మేనేజర్‌గా చేరిన దలాల్ అప్పటి నుంచి సీనియర్ మేనేజర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, CFO - యూరప్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, IT ఫైనాన్స్ మేనేజర్ అండ్ హెడ్‌ వంటి అనేక పదవుల్లో కొనసాగారు. కంపెనీ ఉన్నతిలో జతిన్ దలాల్ పాత్ర ఆమోఘనీయం అని పలువురు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement