ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. | Indian Is Top In Workforce Global Happiness Rankings - Sakshi
Sakshi News home page

Global Happiness Rank: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..

Sep 22 2023 8:03 AM | Updated on Sep 22 2023 1:02 PM

Indian is Top in Workforce Global Happiness Rankings - Sakshi

Global Happiness Ranking: 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది' అలనాడు ఎంతోమందిని అలరించిన పాట పనిచేయడంలో భారతీయులకు సరిగ్గా సరిపోతుందని తాజాగా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆనందంగా పనిచేయడంలో ఇండియన్స్ ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పని ఎలాంటిదైనా.. ఇష్టంగా పనిచేస్తే కష్టం ఉండదు. ఏ దేశంలోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారనే విషయం మీద ఒక సంస్థ నివేదికను రూపొందించింది. ఇందులో భారతీయులే అగ్రస్థానంలో నిలిచింది.12 దేశాల్లోని మొత్తం 15,600 మంది ఐటీ ఉన్నతాధికారులు, బిజినెస్ లీడర్స్ మీద నిర్వహించిన ఈ సర్వేలో ఇండియా నుంచి 1,300 మంచి పాల్గొన్నారు. సుమారు 50శాతం కంటే ఎక్కువ మంది పనిచేయడంలోనే ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

హెచ్‌పీ వర్క్ రిలేషన్‌షిప్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నట్లు సమాచారం. మన దేశంలోని ఉద్యోగులు ఫ్లెక్సిబులిటీ, మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగినట్లుగానే యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి: నకిలీ వెబ్‌సైట్‌లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?

వేతనం కంటే సంతోషానికి ప్రాధాన్యం
భారతదేశంలోని చాలామంది తక్కువ జీతం పొందే ఉద్యోగాల్లో కూడా ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం వారి ఎక్స్‌పీరియన్స్‌ పెంచుకోవడం మాత్రమే కాకుండా.. కమ్యూనికేషన్ వంటి వాటిని పెంచుకోవడానికి కూడా అని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సర్వేలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోని ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement