వాట్సాప్ చాటింగ్ మరింత సరదాగా.. కొత్త ఎమోజీలతో!

Whatsapp testing 21 emojis for android beta users - Sakshi

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్ కోసం కొన్ని బీటా టెస్టర్‌లకు 21 కొత్త ఎమోజీలను విడుదల చేయనుంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు కొత్తగా రానున్న 21 ఎమోజీలను తాజా యూనికోడ్ 15.0 నుండి పంపడానికి వేరే కీబోర్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని వాట్సాప్ కీబోర్డ్ నుండి నేరుగా ఉపయోగించవచ్చు.

గతంలో ఈ 21 కొత్త ఎమోజీలు డెవలప్‌మెంట్‌లో ఉండటం వల్ల, వాట్సాప్ కీబోర్డ్‌లో కనిపించలేదు. అయితే ప్రత్యామ్నాయంగా కీబోర్డ్‌ని ఉపయోగించడం ద్వారా వాటిని పంపించుకోవడం సాధ్యమయ్యేది. బీటా టెస్టింగ్ వినియోగదారులు ఇప్పుడు అధికారిక వాట్సాప్ కీబోర్డ్ నుండి కొత్త ఎమోజీలను యాక్సెస్ చేయవచ్చు.

వాట్సాప్ అకౌంట్‌కి కూడా ఈ బీటా ఫీచర్లు వచ్చే అవకాశాలను పెంచుకోవడానికి, లేటెస్ట్ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను కూడా డెవెలప్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటాలో అభివృద్ధి దశలో ఉంది.

(ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్)

ఇంకో వైపు వాట్సాప్ "సైలెన్స్ అన్నోన్ కాలర్స్" అనే కొత్త ఫీచర్ మీద కూడా పని చేస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ మీ కాల్ లిస్ట్‌లో లేని కొత్త నంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా త్వరలోనే అందుబాటులో రానుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top