Maruti Suzuki Special Discount Offers In March 2023, Check For More Info - Sakshi
Sakshi News home page

Maruti Suzuki March Discounts: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్

Mar 11 2023 7:20 PM | Updated on Mar 11 2023 8:22 PM

Maruti suzuki 2023 march discounts - Sakshi

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి, కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి శుభవార్తను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం 2023 మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్:

మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్‌ కొనుగోలుపైన రూ. 54,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ లభిస్తాయి.

మారుతి సుజుకి బాలెనో:

అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి బాలెనొ మీద కంపెనీ ఈ నెలలో రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం మాన్యువల్ వేరియంట్‌కి మాత్రమే వర్తిస్తాయి. ఆటోమేటిక్, CNG మోడల్స్ కొనుగోలుపైన ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు.

మారుతి సుజుకి సియాజ్:

మారుతి సుజుకి ఇప్పుడు సియాజ్ కొనుగోలుపై రూ. 28,000 తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్స్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్‌లకి వర్తిస్తుంది. ఇందులో రూ. 25,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ లభిస్తాయి. (డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ఖచ్చితమైన ఆఫర్స్ కోసం స్థానిక డీలర్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు).

మారుతి సుజుకి ప్రస్తుతం డిస్కౌంట్స్ అందించడం మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, మారుతి జిమ్నీ 5-డోర్ వంటివి ఉన్నాయి. ఈ కొత్త కార్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement