నెట్‌ప్లిక్స్‌ వినియోగిస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే..!

What Are Phishing Scams In Netflix - Sakshi

స్క్వీడ్‌ గేమ్‌తో మరింత పాపులర్‌ అయిన ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ వరల్డ్‌ వైడ్‌గా మరింత పాపులర్‌ అయ్యింది. కానీ నెట్‌ ఫ్లిక్స్‌లో నచ్చిన సినిమానో, లేదంటే వెబ్‌ సిరీస్‌ను వీక్షించాలంటే ఇతర ఓటీటీల కంటే కాస్త ఎక్కువగానే ప్రిమియం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది నెట్‌ ఫ్లిక్స్‌ను ఫ్రీగా వినియోగించుకునేందుకు థర్డ్‌ పార్టీ యాప్స్‌, వెబ్‌ సైట్‌లను ఆశ్రయిస్తుంటారు. అదే సమయంలో వారిని టార్గెట్‌ చేస్తూ సైబర్‌ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌ స్కై తెలిపింది. ఒరిజినల్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో అకౌంట్‌ ప్రిమియం చెల్లించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాస్పర్‌ స్కై నిపుణులు పలు సూచనలిచ్చారు. 
 
నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను ఫ్రీగా వీక్షించే విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని క్యాస్పర్‌ స్కై హెచ్చరించింది. థర్డ్‌ యాప్స్‌ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లిస్తే ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లను వినియోగించే అవకాశం ఉంది. ఆ సమయంలో థర్డ్‌ పార్టీ యాప్స్‌లో ప్రిమియం చెల్లిస‍్తున్నప్పుడు సైబర్‌ నేరస్తులు తెలివిగా బ్యాంక్‌ అకౌంట్‌లను యాక్సెస్‌ చేస‍్తారని క్యాస్పర్ స్కై రిపోర్ట్‌ను విడుదల చేసింది.    

నకిలీ 'సైన్‌ అప్‌'లతో అప్రమత్తం
మీరు నెట్‌ ఫ్లిక్స్‌ను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే నకిలీ సైన్‌ అప్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం పొందేందుకు మీ ఇమెయిల్, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ వివరాల్ని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్‌ నేరస్తులు ఒరిజనల్‌గా ఉండే ఫేక్‌ నెట్‌ ఫ్లిక్స్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేస్తారు. మీరు వాటిలో లాగిన్‌ అయితే అంతే సంగతులు..మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న మనీ మాయం అవుతుంది. అందుకే ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లలో లాగిన్‌ అయ్యే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సైన్‌ అప్‌ కోసం వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు అందులో అక్షర దోషాలు కనిపిస్తాయి. అలా అక్షర దోషాలుంటే అవి ఫేక్‌ అకౌంట్‌లుగా భావించాలని క్యాస్పర్‌ స్కై  తన నివేదికలో పేర్కొంది. 

మీ వ్యక్తిగత సమాచారం అప్‌డేట్‌తో..
స్కామర్లు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ద్వారా డబ్బుల్ని కాజేసేందుకు మీ ప్రీమియం వివరాల్ని అప్‌ డేట్‌ చేయాలని కోరుతూ మెయిల్స్‌ పంపుతారు. మీ వివరాల్ని అప్‌డేట్‌ చేయకపోతే మీ నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని హెచ్చరిస్తారు. ఆ ఈమెయిల్స్‌ను మీరు యాక్సెస్‌ చేశారా? అంతే సంగతులు  

కొత్తగా వచ్చే సినిమా టీజర్లు, సాంగ్స్‌
ఓటీటీ యూజర్లను ఆకర్షించేందుకు సైబర్‌ కేటుగాళ్లు ఇటీవలి కాలంలో బాగా పాపులరైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో వెబ్‌సైట్‌ను తయారు చేస్తారు. పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సినిమాల్ని, ప్రోమోలు, టీజర్‌లు ఆ వెబ్‌ సైట్‌లలో ఉండడంతో వాటిని ఓపెన్‌ చేసి తక్కువ ప్రీమియం పేరుతో ఊరిస్తుంటారు. అవన్నీ ఫేక్‌ వెబ్‌సైట్లు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మన పర్సనల్‌ డీటెయిల్స్‌తో పాటు బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం అవుతుంది.  

మరి ఎలా జాగ్రత్త పడాలి 
పై స్కామ్‌లు వినడానికి  సింపుల్‌గా ఉన్న.. సైబర్‌ నేరస్తుల చేతి వాటం చూపిస్తే సెకన్ల వ్యవధిలో కోట్లు కొల్లగొట్టేస్తారు. అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాప్సర్‌ స్కై విడుదల చేసిన రిపోర్ట్‌లో సూచించింది. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మెయిల్స్‌, లేదంటే ప్రీమియం చెల్లించాలని మెసేజ్‌లు వస్తే వాటిని ఓపెన్‌ చేయొద్దని, వాటిని ఓపెన్‌ చేసే ముందు ఒరిజినల్‌ నెట్‌ ఫ్లిక్స్‌ వెబ్‌సైట్‌లను సందర్శించాలని, వాటిలో ఫ్రీ, లేదంటే తక్కువ ప్రీమియం మెంబర్‌ షిప్‌ అందిస‍్తుందో చెక్‌ చేయాలి. మీకే ఏమాత్రం అనుమానం వచ్చినా వాటిని ఓపెన్‌ చేయకపోవడమే మంచిదని ఓటీటీ యూజర్లకు క్యాస్పర్‌ స్కై జాగ్రత్తలు చెబుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top