ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్‌ | VGuard Unveils Luxecube Smart and Stylish Water Heating | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్‌

Jun 25 2025 11:10 AM | Updated on Jun 25 2025 11:10 AM

VGuard Unveils Luxecube Smart and Stylish Water Heating

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్‌లో సర్వీసులు అందిస్తున్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సిరీస్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎలివేటెడ్, టెక్-ఫార్వర్డ్ బాత్రూమ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రూపొందించిన ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు లక్సెక్యూబ్, లక్సెక్యూబ్ డీజీ, లక్సెక్యూబ్ స్మార్ట్‌ను  తీసుకొచ్చినట్లు చెప్పింది.

ఇదీ చదవండి: మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

ఆధునిక గృహాల కోసం రూపొందించిన లక్సెక్యూబ్ స్మార్ట్ ఐఓటీ స్మార్ట్ కనెక్టివిటీని ఇంటిగ్రేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌కు అనుకూలమైన వి-గార్డ్ స్మార్ట్ యాప్ ద్వారా హీట్‌ను నియంత్రించవచ్చని పేర్కొంది. వాటర్‌ హీటింగ్‌ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement