మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ | SEBI approved IPOs for several companies | Sakshi
Sakshi News home page

మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Jun 25 2025 10:47 AM | Updated on Jun 25 2025 11:23 AM

SEBI approved IPOs for several companies

కొత్త ఆర్థిక సంవత్సరంలో జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. దీంతో స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మూడు కంపెనీలు అనుమతులు పొందాయి. జాబితాలో ఎల్రక్టానిక్స్‌ బజార్‌ కంపెనీ జీఎన్‌జీ ఎల్రక్టానిక్స్, లాజిస్టిక్స్‌ సర్వీసుల సంస్థ గ్లోటిస్, ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్‌కేర్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలు సెబీకి 2025 ఫిబ్రవరి–మార్చిలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. వీటికి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

జీఎన్‌జీ ఎల్రక్టానిక్స్‌

పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా జీఎన్‌జీ ఎల్రక్టానిక్స్‌ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 51 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఎల్రక్టానిక్స్‌ బజార్‌ బ్రాండుతో పు నరుద్ధరించిన ల్యాప్‌లాప్‌లు, డెస్‌్కటాప్‌లను విక్రయిస్తోంది. వారంటీతో పునరుద్ధరించిన ప్రొడక్టుల పూర్తిస్థాయి వేల్యూ చైన్‌ నిర్వహిస్తోంది. కంపెనీ భారత్‌సహా యూరప్, ఆఫ్రికా, యూఏఈలలో కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా మైక్రోసాఫ్ట్‌ అ«దీకృత పునరుద్ధరణ ప్రొడక్టుల సంస్థగా నిలుస్తోంది.

గ్లోటిస్‌

చెన్నైకు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ గ్లోటిస్‌ ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.45 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిదులను వాణిజ్య వాహనాలు, కంటెయినర్ల కొనుగోలు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. సమీకృత మలీ్టమోడల్‌ లాజిస్టిక్స్‌ సరీ్వసుల సంస్థ గ్లోటిస్‌ ప్రధానంగా ఎనర్జీ సరఫరా సొల్యూషన్లు అందిస్తోంది.

అమంతా హెల్త్‌కేర్‌  

1994లో ఏర్పాటైన ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్‌కేర్‌ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ ప్రధానంగా మెడికల్‌ పరికరాలతోపాటు.. రోగులు నోటి ద్వారా ఔషధాలు తీసుకునేందుకు వీలులేనప్పుడు వినియోగించే స్టెరైల్‌ లిక్విడ్, పేరంటల్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా 113 ప్రొడక్ట్‌ రిజిసే్ట్రషన్లను కలిగి ఉంది.


కల్పతరుకు యాంకర్‌ నిధులు

రూ.708 కోట్లు సమీకరణ

రియల్టీ అభివృద్ధి సంస్థ కల్పతరు పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.708 కోట్లు సమీకరించింది. షేరుకి రూ.414 ధరలో 9 సంస్థలకు 1.71 కోట్ల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో జీఐసీ, బెయిన్‌ క్యాపిటల్, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్, ఎస్‌బీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌ తదితరాలున్నాయి. మంగళవారం(24న) ప్రారంభమైన కంపెనీ ఐపీవో గురువారం(26న) ముగియనుంది. షేరుకి రూ. 387–414 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. హౌసింగ్, కమర్షియల్‌ ఆస్తులకు పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో గతేడాది(2024–25) ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ. 2,727 కోట్ల విలువైన ప్రాపర్టీలను కంపెనీ విక్రయించింది.

Advertisement
 
Advertisement
Advertisement