ఓఎన్‌జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్‌ బ్లాకులు

Vedanta and Reliance BP Avoided Oil Block Auction Only ONGC participate - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ ఆరో విడత వేలంలో మెజారిటీ ఆయిల్, గ్యాస్‌ బ్లాకులను సొంతం చేసుకుంది. మొత్తం 21 ప్రాంతాలకు సంబంధించి ఓపెన్‌ యాక్రేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ కింద చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులకు పెట్రోలియం శాఖ వేలం నిర్వహించింది. ఇందులో 18 ఓఎన్‌జీసీ గెలుచుకోగా, రెండు బ్లాకులను మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ ఇండియా సొంతం చేసుకుంది. మరొక బ్లాకును సన్‌ పెట్రోకెమికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ దక్కించుకుంది. ఈ వివరాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ ప్రకటించింది.

మొత్తం 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కో బిడ్‌ మాత్రమే దాఖలైంది. 16 బ్లాకులకు ఒక్క ఓఎన్‌జీసీయే బిడ్‌ వేసింది. ఆశ్చర్యకరంగా గత వేలాల్లో దూకుడుగా పాల్గొని మెజారిటీ బ్లాకులను సొంతం చేసుకున్న వేదాంత ఈ విడత వేలానికి దూరంగా ఉండిపోయింది. రిలయన్స్‌ బీపీ సంయుక్త సంస్థ కూడా పాల్గొనలేదు. 

చదవండి: తప్పని పరిస్థితిలోనే ఒంటరి ప్రయాణం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top