యోట్టా ఇన్‌ఫ్రా రూ.39,000 కోట్ల పెట్టుబడి

Uttar Pradesh: Yotta Infra Invest 39000 Crores To Expand Operations - Sakshi

డేటా సెంటర్‌ కంపెనీ యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.39,000 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే 5–7 ఏళ్లలో ఈ వ్యయం చేయనున్నట్టు హీరానందానీ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆరు డేటా సెంటర్లను నెలకొల్పనుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

డేటా సెంటర్‌ క్యాంపస్, ఐటీ ఉపకరణాలు, ఇతర హార్డ్‌వేర్‌ కోసం ఈ మొత్తం ఖర్చవుతుందని యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కో–ఫౌండర్‌ దర్శన్‌ హీరానందానీ తెలిపారు. గ్రేటర్‌ నోయిడా డేటా సెంటర్‌ పార్క్‌లో యోట్టా డీ1 డేటా సెంటర్‌ ప్రారంభించిన సందర్భంగా సోమవారం ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

చదవండి: ఎయిర్‌టెల్‌ బంపరాఫర్‌: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్‌, తెలిస్తే వావ్‌ అనాల్సిందే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top