యూజ్డ్‌ కార్లు @ కోటి.. పాత కారు టాప్‌ గేరు! | Used-car sales in India to cross 1 crore annual sales mark by 2030 | Sakshi
Sakshi News home page

యూజ్డ్‌ కార్లు @ కోటి.. పాత కారు టాప్‌ గేరు!

Jan 28 2025 1:55 AM | Updated on Jan 28 2025 7:59 AM

Used-car sales in India to cross 1 crore annual sales mark by 2030

2030 నాటికి ఏటా ఈ స్థాయికి 

మారుతీ స్విఫ్ట్‌కు అధిక డిమాండ్‌ 

కార్స్‌24 తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: పాత కార్ల అమ్మకాలు 2023లో దేశవ్యాప్తంగా 46 లక్షల యూనిట్లు దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య ఏటా 1 కోటి యూనిట్లను దాటుతుందని కార్స్‌24 తాజా నివేదిక వెల్లడించింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి యూజ్డ్‌ కార్ల విభాగం సగటు వార్షిక వృద్ధి ఏటా 13% నమోదు కానుంది. ఈ లెక్కన వార్షిక అమ్మకాలు ఆ సమయానికి 1.08 కోట్ల యూని ట్లకు చేరుకుంటాయి. 

పాత కార్లకు డి మాండ్‌ నగరాలు, పట్టణాల్లో దూసుకెళ్లనుంది. మహా రా ష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ జోరును నడిపిస్తున్నా యి. మరింత చవక, ఆధారపడదగిన ఎంపికల కోసం వినియోగదార్ల ప్రాధాన్యతలు మారుతు న్నందున కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ పురోగమిస్తోంది. పాత కార్ల విపణిలో 2024లో 16.7 శాతం వాటాతో ఎస్‌యూవీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎస్‌యూవీల డిజైన్, సామర్థ్యం, ప్రీమియం ఆకర్షణలు పట్టణ, గ్రామీణ కస్టమర్లకు ఇష్టమైనవిగా మారాయి.  

వ్యక్తిగత వాహనాలకు.. 
కోవిడ్‌ అనంతర కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు కనిపించింది. షేర్డ్‌ మొబిలిటీ కంటే సౌలభ్యం, భద్రత కోసం 12 శాతం మంది కార్ల కొనుగోలుదారులు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెట్రో, నాన్‌–మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్‌ ఉన్న మోడల్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ అవతరించింది. 

అలాగే హ్యుండై శాంట్రో, టాటా టియాగో ఎన్‌ఆర్‌జి, మారుతీ సుజుకీ వ్యాగన్‌–ఆర్‌ వంటి మోడళ్లు అసాధారణ రీసేల్‌ విలువను స్థిరంగా అందించాయి. బడ్జెట్‌ స్పృహ, విలువను చూసే కొనుగోలుదారులలో ఈ మోడళ్లకు ప్రజాదరణ పటిష్టంగా ఉంది. కొత్త కార్ల ఫైనాన్సింగ్‌ గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఫైనాన్సింగ్‌ వాటా 2010లో 60 శాతం నుండి 2024లో 84 శాతానికి చేరింది అని నివేదిక వివరించింది. నూతన వాహనాల కోసం రుణాలపై వినియోగదారులు ఆధారపడుతున్నారని చెప్పేందుకు ఈ గణాంకాలు నిదర్శనమని కార్స్‌24 కో–ఫౌండర్‌ గజేంద్ర జంగిద్‌ తెలిపారు.

→ 2023లో అమ్ముడైన పాత కార్లు 46 లక్షల యూనిట్లు 
→ 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్లకు విక్రయాలు 
→ యూజ్డ్‌ కార్ల విపణి సగటు వార్షిక వృద్ధి ఏటా 13% 
→ ఎస్‌యూవీలదే హవా. వీటి వాటా 2024లో 16.7 శాతం  
→ కొత్త కార్ల ఫైనాన్సింగ్‌ వాటా 2010లో 60 శాతం. 2024లో 84 శాతానికి చేరిక.   
→ వ్యక్తిగత వాహనాలకే 12 % మంది మొగ్గు 
→ అత్యంత డిమాండ్‌ ఉన్న మోడల్‌ మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement