మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. కంపెనీకి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, సరదా వ్యాఖ్యలతో కూడా ఆయన నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఒక అభిమాని ఆయనకు ఇంకా 20 సంవత్సరాలే ఆయుష్షు ఉందని కామెంట్ చేయడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అక్టోబర్ 14న ఆనంద్ మహీంద్రా భూటాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అందజేసిన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. అందులో మహీంద్రా కంపెనీకి చెందిన వాహనాలను చూసి, అవి తనకు బాగా పరిచయమైనవేనని సరదాగా స్పందించారు.
70 ఏళ్లుగా కార్ల తయారీ
ఈ పోస్టుపై నితిన్ మేష్రామ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. మహీంద్రా కంపెనీపై కొన్ని విమర్శలు చేశారు. గత 70 ఏళ్లుగా సంస్థ కార్లను తయారు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు V6, V8 ఇంజిన్లను తయారు చేయలేదని, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును కూడా తీసుకురాలేదని అన్నారు. పరిశ్రమలో ఎలాంటి తొలి వాహనాన్ని ఆవిష్కరించలేదని పేర్కొన్నారు.
దీనికి ఆనంద్ మహీంద్రా కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. 2006లోనే స్కార్పియో ఆధారంగా భారతదేశపు తొలి డీజిల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాన్ని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించామని చెప్పారు. మార్కెట్ దానికి సిద్ధంగా లేకపోవడంతో దానిని వాణిజ్యపరంగా విడుదల చేయలేదు.
Nitin, Check this out. We unveiled India’s first diesel-electric hybrid passenger vehicle, (on a Scorpio platform) at the Delhi Auto Expo. In 2006. Two decades ago. Didn’t commercialise it because the market simply wasn’t ready. As for V6s and V8s, building them was never rocket science. The real question was whether India needed more gas-guzzlers. We thought not. Sometimes innovation is about what you choose not to build. My advice? Look before you leap. Pause before you punch. 🙂 https://t.co/nPBSJsU2nC Hi
— anand mahindra (@anandmahindra) October 15, 2026
అలాంటివి తయారు చేయడం పెద్ద పని కాదు
ఇక V6లు, V8ల విషయానికొస్తే, వాటిని తయారు చేయడం అంత కష్టమైన పనేమీ కాదని ఆనంద్ మహీంద్రా అన్నారు. కానీ, ఎక్కువ ఇంధనం ఉపయోగించే కార్లను తయారు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. అందుకే కంపెనీ అలాంటి ఇంజిన్లను తయారు చేయకూడదని నిర్ణయించుకుందని తెలిపారు. కొత్తవి తయారు చేయడం మాత్రమే ఆవిష్కరణ కాదు, అవసరం లేని వాటిని తయారు చేయకపోవడం కూడా ఒక మంచి నిర్ణయమేనని చెప్పారు.
ఇంతలో ప్రణేష్ నాయుడు అనే వ్యక్తి ఒక ట్వీట్ చేసారు. తాను చిన్నప్పటి నుంచి ఆనంద్ మహీంద్రాకు అభిమానినని చెబుతూనే, ''ఆనంద్ అంకుల్, మీరు మరో 20 ఏళ్లలో చనిపోవచ్చు'' అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా.. తన జీవితకాలంలోనే మహీంద్రా ఒక శక్తివంతమైన V8 లేదా V10 ఇంజిన్‌ను తయారు చేస్తే చూడాలని ఉందని చెప్పారు. 500 హార్స్‌పవర్ ఉన్న V8 ఇంజిన్‌తో స్కార్పియో వస్తే అదిరిపోతుందని తన కోరికను వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గోల్డ్ మార్కెట్‌లో సంచలనం.. కుప్పకూలిన ధరలు!
ఆనంద్ మహీంద్రా రిప్లై
ఈ కామెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. తనకు అభిమాని ఉండటం సంతోషంగా ఉందని, కానీ తన జీవితకాలం గురించి అంత ధీమాగా 20 ఏళ్ల గడువు నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మరో 20 ఏళ్లు జీవించడం కూడా మంచి విషయమే, అయినా.. తాను అంతకంటే ఎక్కువ కాలం జీవించాలని, V8 ఇంజన్ల గురించి చర్చించే ముందు.. తన వారంటీని పొడిగించమని మహీంద్రా కోరారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.
Pranesh, I’m flattered that you’re a fan. But I’m a little shaken by the confidence with which you’ve handed me a 20-year expiry date! I know that would be a respectable innings, but I was hoping to stick around on the planet just a wee bit longer. So before we discuss V8 engines, could I persuade you to extend my warranty? 😀
— anand mahindra (@anandmahindra) October 22, 2026


