Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!

Union Budget 2023: Some Interesting Facts You Should Know About Budget - Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్​ కానుంది. దీంతో ఈ సారి బడ్జెట్‌కు ప్రత్యేకత సంతరించుకుంది. దేశ బడ్జెట్​ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ ఏడాది బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్​ విషయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లు​క్కేద్దాం!

►1977లో అప్పటి ఆర్థికమంత్రి హీరాభాయ్​ ములిజిభాయ్​ పటేల్​ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

►బడ్జెట్​లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ప్రసంగించారు​. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

►అత్యధిక బడ్జెట్​ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్​ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రికార్డ్‌ చెక్క చెదరకుండా అలానే ఉంది.

►బ్రిటీష్​ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. కొత్త తేదీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్​ జైట్లీ నిలిచారు.

►జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మాత్రమే బడ్జెట్‌ను సమర్పించిన ఏకైక ప్రధానులు.

►1999 వరకు, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు.

►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె 2.42 గంటలపాటు ప్రసంగించారు. ఇదే ఇంతవరకు ఎక్కువ సమయం ప్రసంగించిన బడ్జెట్‌గా రికార్డ్‌ నమోదు చేసింది.

►కేంద్ర బడ్జెట్ 1950లో లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ ముద్రణ జరుగుతుండగా, ఈ లీక్ తర్వాత, దానిని న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చాల్సి వచ్చింది. 

► ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు.

చదవండి: బడ్జెట్‌ 2023: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top