నిరుద్యోగం తగ్గింది..  జాతీయ శాంపిల్‌ సర్వే వెల్లడి

Unemployment rate dips in January March quarter 2023 survey - Sakshi

న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు (15 ఏళ్లు నిండిన వారు) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.8 శాతానికి పరిమితమైంది. 2022 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉన్న 8.2 శాతంతో పోలిస్తే చెప్పుకోతగ్గ మేర తగ్గింది. పనిచేసే శక్తి ఉండి, ఉపాధి లేని వారిని నిరుద్యోగుల కింద పరిగణిస్తారు. గతేడాది మొదటి త్రైమాసికంలో నిరుద్యోగం ఎక్కవగా ఉండడానికి కరోనా వైరస్‌ ఇంకా సమసిపోకపోవడమేనని చెప్పుకోవాలి. ఇక 2022 అక్టోబర్‌–డిసెంబర్, జూలై–సెప్టెంబర్‌ కాలంలో 7.2 శాతం చొప్పున నిరుద్యోగ రేటు నమోదైంది. 2022 ఏప్రిల్‌–జూన్‌లో 7.6 శాతంగా ఉంది.  

  • పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగం 2023 మొదటి మూడు నెలల్లో 9.2 శాతానికి తగ్గింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇది 10.1 శాతంగా ఉంది.  
  • పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతంగా ఉంది. 2022 అక్టోబర్‌–డిసెంబర్‌లో ఇది 6.5 శాతంగా ఉంది.  
  • కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.5 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 47.3 శాతంతో పోలిస్తే కొంత మెరుగుపడింది.

ఇదీ చదవండి: బ్యాంకింగ్‌ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top