
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ట్విటర్.. వ్యాపార సంస్థల ఖాతాలకు ఇచ్చే వెరిఫైడ్ గోల్డ్ బ్యాడ్జ్ ద్వారా ఒక్కో దానిపై నెలకు 1,000 డాలర్లు (రూ.83,000) వసూలు చేయబోతోంది. దీనికి మరో 50 డాలర్లు (రూ.4,000) అదనం.
ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!
ఏప్రిల్ 1 నుంచి ట్విటర్ కొత్త వెరిఫికేషన్ స్కీమును అమలు చేయబోతోంది. ఈ మేరకు తాజాగా కొత్త వెరిఫికేషన్ స్కీమును కంపెనీ ఆవిష్కరించింది. వ్యాపార సంస్థలకు ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్‌లకు సంబంధించిన ప్రణాళికను గత డిసెంబర్‌లోనే ట్విటర్ ప్రకటించింది.
ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!
వెరిఫైడ్ సంస్థల ఉద్యోగులకు చెందిన వెరిఫైడ్ వ్యక్తిగత ఖాతాలు కొనసాగుతాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. సంస్థలకు సంబంధించిన ఖాతాల వెరిఫికేషన్ (గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అనే పిలిచేవారు) ప్రక్రియను త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?