ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్.. | TVS Raider 125 Price Dropped | Sakshi
Sakshi News home page

ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్..

Sep 23 2024 9:10 PM | Updated on Sep 23 2024 9:10 PM

TVS Raider 125 Price Dropped

పండుగ సీజన్ మొదలవుతోంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించేసాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన రైడర్ 125 మీద తగ్గింపులను ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్‌ రూ. 84,869కే లభిస్తుంది.

టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్‌ 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.2 న్యూటన్ మీటర్ టార్క్, 11.4 హార్స్ పవర్ అందిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఆఫర్స్ అందిస్తున్న కంపెనీల జాబితాలో టీవీఎస్ మాత్రమే కాకుండా.. చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలను పెంచడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటి గురించి పూర్తిగా కనుక్కున్న తరువాత కొనుగోలు చేయడం ఉత్తమం.

Advertisement
 
Advertisement
Advertisement