
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను.. ఫోర్బ్స్ ఇండియా (Forbes India) రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు.
105 బిలియన్ డాలర్ల నికర విలువతో ముకేశ్ అంబానీ.. ప్రధమ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 12 శాతం క్షీణించింది. 2వ స్థానంలో మౌలిక సదుపాయాల దిగ్గజం గౌతమ్ అదానీ & కుటుంబం 92 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. మొత్తం మీద వందమంది ధనవంతుల సంపద 2025లో 9 శాతం తగ్గింది.
ఓపీ జిందాల్ గ్రూప్‌కు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ 3.5 బిలియన్లు తగ్గి.. 40.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో ఉన్న మహిళగా ఈమె రికార్డ్ క్రియేట్ చేశారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ వరుసగా నాలుగు, ఐదోస్థానంలో నిలిచారు.
ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
భారతదేశంలోని టాప్ 10 బిలినీయర్స్
➤ముకేశ్ అంబానీ: 105 బిలియన్ డాలర్లు
➤గౌతమ్ అదానీ & కుటుంబం: 92 బిలియన్ డాలర్లు
➤సావిత్రి జిందాల్: 40.2 బిలియన్ డాలర్లు
➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 34.2 బిలియన్ డాలర్లు
➤శివ్ నాడర్: 33.2 బిలియన్ డాలర్లు
➤రాధాకిషన్ దమానీ & కుటుంబం: 28.2 బిలియన్ డాలర్లు
➤దిలీప్ షాంఘ్వీ: 26.3 బిలియన్ డాలర్లు
➤బజాజ్ కుటుంబం: 21.8 బిలియన్ డాలర్లు
➤సైరస్ పూనవల్లా: 21.4 బిలియన్ డాలర్లు
➤కుమార్ మంగళం బిర్లా: 20.7 బిలియన్ డాలర్లు
Forbes India Rich List 2025: India's richest, Mukesh Ambani, remains a 'centibillionaire', Savitri Jindal is the only woman in the top 10, while Sunil Mittal and family are the biggest gainers. Here's a look at India's 100 richest.https://t.co/V7HUD44U4Z
— Forbes India (@ForbesIndia) October 9, 2025