సాక్షి మనీ మంత్ర : భారీగా పడిపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు.. కారణం ఏంటంటే? | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : భారీగా పడిపోయిన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు.. కారణం ఏంటంటే?

Published Fri, Aug 25 2023 10:14 PM

Today Stock Market Updates By Karunya Rao - Sakshi

ఈ వారం చివరి రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. పెరిగిపోతుందనే ద్రవ్యోల్బణం అంచనాలు, ఎంపీసీలో కీలక రేట్లు యాథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడి, అమెరికా ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌ పోవెల్‌ నుంచి వడ్డీ రేట్ల గురించి ప్రకటన వంటి అంశాలతో మదుపరులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 65 వేల పాయింట్ల దిగువన ముగియగా.. నిఫ్టీ 19,300 మార్కును కోల్పోయింది.

అయితే ఈ స్థాయి మార్కుకు పడిపోవడంపై మార్కెట్‌ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులై నెలలో మార్కెట్‌లో ఊహించని విధంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లు అంచనాల కంటే తక్కువగా ట్రేడ్‌ అయ్యాయి. 

తాజాగా ఇదే తరహాలో శుక్రవారం సైతం లోయర్‌లో ట్రేడింగ్‌ను ముగించాయి. అందుకు ప్రధాన కారణం ఇరాక్‌, ఇరాన్‌ దేశాల ఇన్వెస్టర్లు అమెరికా వడ్డీరేట్లు తీరుతెన్నులపై గమనించడం, దీంతో పాటు ట్రెండ్‌కు అనుగుణంగా మార్కెట్‌ ప్రారంభం నుంచి స్టాక్స్‌ను అమ్మే ధోరణి మార్కెట్‌ ముగిసే వరకు కనిపించింది. ఇలా మార్కెట్‌ అంచనాల కంటే తక్కువ స్థాయిలో ట్రేడ్‌ అయ్యాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

 ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement