సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ

Today Stock Market Closing Nifty 50 slips below19700 - Sakshi

19700  దిగువకు నిఫ్టీ

 ఆరంభ లాభాలు ఆవిరి

19 పైసలుఎగిసిన రూపాయి

Today StockMarket Closin: దేశీయ స్టాక్‌మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి.  చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్‌ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద  స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది.

దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్‌ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్‌ఎం ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా టాప్‌ గెయనర్స్‌గా నిలవగా, డా.రెడ్డీస్‌, విప్రో,యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, సిప్లా టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది.  82.93 ముగిసింది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top